రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో బీసీ వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేశారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో బీసీ వర్గానికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రకారం కేటాయింపులు చేయాలి...
⏩ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు డిమాండ్..
ఈ సందర్భంగా ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు మాట్లాడుతూ..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నార్త్, సౌత్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుకు సంబంధించి నిర్వహించిన డ్రాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వికలాంగులకు కేటాయించిన రిజర్వేషన్ శాతాలను స్పష్టంగా వెల్లడించారని తెలిపారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం, వికలాంగులకు 5 శాతం కేటాయింపుల వివరాలు ప్రకటించినప్పటికీ, బీసీ వర్గానికి రిజర్వేషన్ ప్రకారం ఎంత శాతం ఇళ్లు కేటాయించారో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు.
బీసీ వర్గానికి సంబంధించిన కేటాయింపులపై పూర్తి వివరాలు వెల్లడించకుండా డ్రా నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీసీలకు రిజర్వేషన్ ప్రకారం ఎంత మేర ఇళ్లు కేటాయించారో, మిగిలిన ఇళ్లను ఏ ప్రాతిపదికన పంపిణీ చేశారో అధికార యంత్రాంగం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం వెంటనే పునర్విచారణ జరిపి, అన్ని వర్గాలకు రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా సమాన న్యాయం జరిగేలా డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని కోరారు. బీసీ వర్గానికి జరిగిన వివక్షను సరిదిద్దకపోతే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు.