జయశంకర్ భూపాలపల్లి(రైట్స్ మీడియా): పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ శనివారం రేగొండ మండలం పాండవుల గుట్ట వద్ద నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాంగణం, సందర్శకులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ఆమె పరిశీలించారు. పర్యాటక దినోత్సవాన్ని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి రఘు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.