Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

పాలకుర్తి అభివృద్ధి, మహిళా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ..

⏩మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారదలతో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ (TPCC) వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి భేటీ.

పాలకుర్తి అభివృద్ధి, మహిళా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ..
Share Short Clip Download PDF

హైదరాబాద్(రైట్స్ మీడియా): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి మరియు మహిళా సంక్షేమమే ధ్యేయంగా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ (TPCC) వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖులతో సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, సాంఘిక, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై మంత్రితో విస్తృతంగా చర్చించి, నియోజకవర్గానికి అవసరమైన నిధులు మరియు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

పాలకుర్తి అభివృద్ధి, మహిళా సంక్షేమంపై సుదీర్ఘ చర్చ..

అనంతరం, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన నేరెళ్ల శారద ని కలిసారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, రక్షణ మరియు సాధికారత కోసం చేపట్టాల్సిన వినూత్న కార్యక్రమాలపై ఈ సందర్భంగా స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు. మహిళలకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ను కోరారు.