అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తో బీసీ సంఘాల బృందం కలిసింది. ఈ సందర్బంగా జాతీజనగణలో ఓబీసీ కాలం చేర్చే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ నేతృత్వం లో ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

సంచార జాతుల విముక్తి దినోత్సవం రాష్ట్ర పండుగగా జరపాలని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి కోరారు. అలాగే ఈ నెలలో హైదరాబాదులో జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరారు. సీఎంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను బృందం కలిసి విజ్ఞప్తి చేసింది.

ఈ భేటీలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, సంచార జాతుల సంఘాల నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.