వర్ధన్నపేటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ లోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ విద్యాసాగర్, మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ పాలకుర్తి సారంగపాణి, స్థానిక పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరిండెంట్ వీరన్, పిఎసిఎస్ కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ కన్నా, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకటరమణ, వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ ఆవరణంలో స్టేషన్ ఎస్.హెచ్.ఓ సాయిబాబా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచులు పంచాయతీల ఆవరణలలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.