శనివారం రోజున హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ల తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పేదల ముఖంలో చిరునవ్వులు పూయిస్తోందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,గృహ జ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసనిచ్చిన ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
తాజాగా శనివారం నుంచే లబ్ధిదారులకు ఉచిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిబద్ధతకు అద్దం పడుతోందన్నారు.కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.పేద కుటుంబాల ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలను కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి,నాయకులు,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.