కొంపల్లి లోని అండర్ కన్స్ట్రక్షన్ బ్రిడ్జి కింద మృతురాలు అనిత, భర్త పేరు చిన్న. నిజామాబాద్ కు చెందిన వారు. ఇక్కడే బ్రిడ్జి కింద ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. గత కొంతకాలంగా మృతురాలు యొక్క ఆరోగ్య పరిస్థితి బాలేక ఆమెకు పసిరికలు వచ్చినవి. అట్టి మహిళను ఆసుపత్రి చూపించే పరిస్థితి స్తోమత లేకపోవడంతో మృతురాలు ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది. ఇట్టి విషయం తన భర్త అటుగా వెళ్లే వారి కి తెలపగా వారు 112 డైల్ చేయగా పేట్ బషీరాబాద్ పోలీస్ వారు వెళ్లి చూడగా అతనికి దహన సంస్కారాలు చేసే స్తోమత లేదని తెలిసింది. ఈ విషయం ఇన్స్పెక్టర్ విజయ వర్ధన్ కి తెలుసుకొని, తన సొంత ఖర్చులతో అట్టి మహిళకు దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది.
పేదరీకంతో మహిళ మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు