నార్సింగిలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒక బైకును ఢీకొంది. ఘటనలో బైకు పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మితిమీరిన వేగంతో బైక్ డీ కొట్టి ఆపకుండా వాహనం పారిపోయింది. బైక్ ను కొట్టిన వెంటనే అదుపుతప్పి ఫుట్పాత్ పై పడి యువకుడు ప్రాణాలు విడిచాడు. మృతుడు గోల్కొండకు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ గా గుర్తించారు. ఫస్ట్ క్లబ్ లో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. నార్సింగి నుండి గండిపేట వైపు డెలివరీ తీసుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సిసి టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.