నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కుటుంబ తగాదాల వల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ మరియు పెన్షన్ మొదలైన వాటికోసం ఇద్దరు భార్యలు కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి వారి కుటుంబాల వల్ల ఎన్నో రోజులుగా బాధపడుతున్న ఈ సమస్యపై జిల్లా న్యాయ సేవ అధికార సమస్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి
'' మధ్యవర్తిత్వము '' ద్వారా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ న్యాయమూర్తి నీలిమ ముద్దసాని వారికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చి వారి యొక్క సమస్యపై రాజీ పడు విధంగా వారికి ఇరువురికి న్యాయశాఖ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ యొక్క సమస్యను , ఇద్దరి ఒప్పందాల మేరకు రాజీ చేశారు.

రాజీ మార్గమే రాజీ మార్గం అనే నినాదం పై ఈ యొక్క కేసును మా సంస్థ ద్వారా ప్రి లిటిగేషన్ కేసుగా రిజిస్టర్ చేసుకోబడిన దానిని ఇరువురికి నోటీస్ రూపంలో అందించి దీని తర్వాత ఇరుపక్షాలకు వాయిదాల పద్ధతిలో కౌన్సిలింగ్ ఇచ్చి ఈ యొక్క కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా ఇరుపక్షాలు వారి యొక్క ఒప్పందాలను సంస్థకు అందజేసి వారి ఇష్టపూర్వకంగా కేసుని రాజీ కుదుర్చుకొని ఇచ్చిన దరఖాస్తులను రద్దు చేసుకునే అవకాశం వీలవుతుంది. ఇలాంటి సమస్యల ద్వారా ఎందరో ఎన్నో కుటుంబాలు సమయాన్ని , డబ్బును వృధా చేసుకుంటూ పోలీస్ స్టేషన్ కోర్టు చిట్టి తిరుగుతూ కాలనీ వృధా చేసుకుంటున్నారు.
ఇలాంటి రాజీ పడే ఎలాంటి సమస్యలనైనా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా మీ యొక్క విలువలను డబ్బును సమయాన్ని వృధా కానివ్వకుండా మరి మధ్యవర్తిత్వము ద్వారా సమస్యలపై పరిష్కారం చూపడానికి ముందుంటుందన్నారు.