నిజామాబాద్(రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఫిర్యాదు దారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు తెలియజేశారు.
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు.
ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని తెలియజేశారు.