Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

DLSA కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం…

• జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు

DLSA కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం…
Share Short Clip Download PDF

ఖమ్మం (రైట్స్ మీడియా): ఖమ్మం జిల్లా న్యాయసేవాధికార సంస్థ పరిధిలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన ఏకీకృత వేతనంపై పని చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం. నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈ ప్రకటన ద్వారా ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్, ఆఫీస్ ప్యూన్ (మున్షీ/అటెండెంట్) పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు. ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ (03 పోస్టులు) లకు డిగ్రీ అర్హతతో పాటు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా ఎంట్రీ నైపుణ్యాలు ఉండాలని, ఆంగ్ల టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (45 w.p.m. స్పీడ్) ఉత్తీర్ణులై ఉండాలని, ఫైళ్ల నిర్వహణపై అవగాహన ఉండాలని, నెలకు రూ. 20,000 వేతనం అందించబడుతుందని చైర్మన్ అన్నారు. ఆఫీస్ ప్యూన్- మున్షీ/అటెండెంట్ (02 పోస్టులు) లకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, నెలకు రూ. 15,000 వేతనం అందించబడుతుందని తెలిపారు.

తేదీ 01-09-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎస్సీ , ఎస్టీ, బిసి, ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు (PHC) 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుందని చైర్మన్ తెలిపారు.

అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను సీల్ చేసిన కవరుపై "దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును" స్పష్టంగా పేర్కొంటూ "చైర్మన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ఖమ్మం" అనే చిరునామాకు కేవలం పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుందని, నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని చైర్మన్ అన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులు తేదీ. 17-10-2026 సాయంత్రం 5.00 గంటలలోగా అందాలని, గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులు, అలాగే తపాలా/కొరియర్ ఆలస్యానికి కార్యాలయం బాధ్యత వహించదని అన్నారు.

ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/మౌఖిక పరీక్షల తేదీల వివరాలను కేవలం ఖమ్మం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే తెలియజేస్తారని, వ్యక్తిగత సమాచారం పంపబడదని, పోస్టుల ఎంపికపై నిర్ణయం పూర్తిగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ గారిదే తుది నిర్ణయమని ఆ ప్రకటనలో చైర్మన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేర్కొన్నారు.

📄 Open PDF