నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968, సెక్షన్ 20(1) ప్రకారంగా గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలో గల కల్లు దుకాణాలు, కల్లు డిపోలు , ఐ.ఎమ్.ఎల్ షాప్స్, 2-బి బార్స్, క్లబ్బులు, టిడి-1 మరియు టి.యస్.బి.సి.ఎల్ మొదలగునవి తేదీ: 25-9-2026 సాయంత్రం 6 గంటల నుండి తేది : 27-9-2026 ఉదయం 6 గంటల వరకు మూసి వేయబడును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.