శామీర్‌పేట్ / మేడ్చల్ (రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ మరియు వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో బిజెపి ముఖ్య నాయకులు, జిల్లా పదాధికారులతో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయామే ధ్యేయంగా శ్రమించాలి: ఎంపీ ఈటల రాజేందర్
⏩శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిసార్ట్‌లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీజేపీ సన్నాహక సమావేశం.
⏩కార్యకర్తలకు వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేసిన మల్కాజిగిరి ఎంపీ.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా రాత్రింబవళ్లు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయి కార్యాచరణ, ఓటర్ల నమోదు మరియు ప్రచార సరళిపై నాయకులకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బంగారి శృతి, రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, జిల్లా ఇంచార్జి సమా రంగా రెడ్డి, మాజీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డిలతో పాటు జిల్లా పదాధికారులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.