కరీంనగర్(రైట్స్ మీడియా): హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మంత్రి నేరుగా మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఏ మేరకు అందుతున్నాయో తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, ఆయా సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.
మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా రెండు మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.40 లక్షల రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.