జనగామ(రైట్స్ మీడియా): యువతలో పొగాకు వినియోగాన్ని నివారించడంతో పాటు వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్–2026 అమలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నిర్దేశిత లక్ష్యాల సాధనపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.