కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ విభాగ సీనియర్ ఆచార్యులు ఆచార్య వై. నరసింహ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో ప్రధానం చేసిన “స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్–2026” ను అందుకున్న సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వైస్‌ఛాన్సలర్ ఆచార్య వై. నరసింహ రెడ్డిని అభినందించి, ఆయనకు లభించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం విశ్వవిద్యాలయానికి గర్వకారణమని పేర్కొన్నారు. బోధన, పరిశోధన రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య వై. నరసింహ రెడ్డిని గోల్డ్ మెడల్, రూ.10,000 నగదు పురస్కారం, ప్రశంసాపత్రంతో సత్కరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, డీన్ ఆచార్య ఎన్. ప్రసాద్, ప్రిన్సిపాల్ ఆచార్య జే. కృష్ణవేణి, ఆచార్య గాదె సమ్మయ్య, ఆచార్య స్వరూప రాణి, ఆచార్య ఎస్. జ్యోతి, డాక్టర్ ఆర్. మేఘనా రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఆచార్య వై. నరసింహ రెడ్డిని అభినందించారు.