హైదరాబాద్ (రైట్స్ మీడియా): భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

నగరంలోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ఈ నిరసన ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టీ విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అలాగే మాజీ ఎంపీ అజారుద్దీన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర ముఖ్య నేతలు భారీ సంఖ్యలో హాజరై పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందుకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అక్కడ రోడ్డుపై బైఠాయించి తీవ్ర స్థాయిలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ప్రజాప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తంచేశారు.