ములుగు(రైట్స్ మీడియా): సోమవారం ములుగు మండలం జగ్గంపేట గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్‌ ఉచిత విద్యుత్‌ పథకం కింద రెండు గృహాలపై ఒక్కొక్కటి రెండు కిలోవాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్‌ ప్లాంట్లను జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు.

అనంతరం ఉపాధి హామీ పథకం 2026–27 నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన శ్రీ సీతారాముల గ్రామ సమాఖ్య భవనాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కళ్యాణి, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ భిక్షపతి, జిల్లా విద్యాశాఖాధికారి సిద్ధార్థరెడ్డి, అదనపు పీడీ శ్రీనివాస్‌, డీపీఎం, ఏపీఎం, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.