నిజామాబాద్ (రైట్స్ మీడియా): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పిఆర్సి, డిఏ లకు సంబంధించిన జీవోలను విడుదల చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ,పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డీమిండ్ చేశారు. గతంలో ఎన్నికల కారణంగా పిఆర్ సి, డిఏ లకు సంబంధించిన ప్రతిపాదనలు వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయని కావున సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేసే ధోరణి అవలంబించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతారని పిఆర్ టియు తెలంగాణ పక్షాన జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.