నరసరావుపేట (రైట్స్ మీడియా): హైదరాబాద్‌కు చెందిన SV Professionals ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వాగ్దేవి డిగ్రీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులకు ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు ఆఫర్ లెటర్లను అందజేశారు. ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలకు నరసరావుపేటలోని అన్ని డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా, మొత్తం 12 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఐదుగురు ఎంపిక కావడం విశేషం. విద్యార్థులు ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు మంచి శిక్షణ అందించి, వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసిన వాగ్దేవి డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని, అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు.
వాగ్దేవి విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్ లెటర్లు అందజేసిన ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు
విద్యార్థుల భవిష్యత్ విజయాలకు తమ కళాశాల ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాగ్దేవి డిగ్రీ కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కాట్లు రామకోటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్స్ ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సూదా సురేష్ బాబు, పాశం కృష్ణారావు, ఇస్సేపల్లి కృష్ణకిషోర్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.