Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

అవినీతికి కేరాఫ్ గా నిజామాబాద్ బల్దియా: బల్దియాపై పోరు ఉద్యమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ఆరోపణలు

• కార్పొరేషన్ బడ్జెట్ లో కోట్లు...పనులు మాత్రం శూన్యం.. ప్రభుత్వం, మేయర్, పీసీసీ అందరూ కాంగ్రెస్సే.. అయినా అభివృద్ధి ఎక్కడా?: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

అవినీతికి కేరాఫ్ గా నిజామాబాద్ బల్దియా: బల్దియాపై పోరు ఉద్యమంలో ఎమ్మెల్యే ధన్ పాల్ ఆరోపణలు
Share Short Clip Download PDF

• ర్యాలీగా అర్బన్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ల కార్పొరేషన్ కార్యాలయ ముట్టడి... కమిషనర్ తీరుపై అసహనం...

• తీవ్ర ఉద్రిక్తత... కార్యాలయం ముందు బైఠాయింపు...

నిజామాబాద్ (రైట్స్ మీడియా): అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిజామాబాద్ కార్పొరేషన్ మారిందని, ప్రతి బడ్జెట్ మీటింగ్ లో కోట్లు కేటాయిస్తారు కానీ పనుల కోసం రూపాయి ఖర్చు చేయడం లేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ కార్పొరేటర్లు కలిసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బీజేపీ పోరు ఉద్యమం చేపట్టింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యే గా ఉండి కూడా ధర్నా చేస్తున్నానంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కార్పొరేషన్లు 150 కోట్ల ఆదాయం, 94 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా ఒక్క రూపాయి ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటున్నారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలించిన మేయర్ వాళ్లే ఉన్నా అభివృద్ధి చేయలేకపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అభివృధ్ధి కొరకు 200 కోట్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పటివరకు విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇక్కడి మేయర్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నారు.

నిజామాబాద్ ప్రజలకు నిధులు కాగితాలపై కనిపించడం అవసరం లేదు. ఆ నిధులతో చేసిన రోడ్డు కనిపించాలి, నిర్మించిన డ్రైనేజీలు కనిపించాలి, వెలిగే దీపాలు కనిపించాలన్నారు. కమిషనర్ కు అనేకసార్లు కలిసి లేఖలు అందించిన స్పందించకపోవడం తగదని ఆరోపించారు. బడ్జెట్ లో డివిజన్ల అభివృద్ధి కొరకు 35 కోట్లు కేటాయించిన ఇప్పటి వరకు ఒక్క డివిజన్ కు కూడా రూపాయి కేటాయించలేదన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ

ఇందూరు అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కలిసి నిధులు తీసుకొస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పథకాల్లో కేంద్రం వాటా ఉందన్నారు. మాధవ నగర్ వంతెనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. ఇందూరు అభివృద్ధి కొరకు గెలిచిన ఎమ్మెల్యేకు నిధులు ఇవ్వకుండా ఓడిన షబ్బీర్ణులకి మహేష్ కుమార్ గౌడ్ కు పెత్తనం ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
కార్పొరేషన్ ముట్టడితో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్పొరేషన్ కార్యాలయ ముట్టడికి బయల ఈ నేపథ్యంలో పోలీసులు, ఎమ్మెల్యే, బిజెపి కార్పొరేటర్లు మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే ధన్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ వచ్చే వరకు జరిగేది లేదని హెచ్చరించి బైఠాయించారు. అనంతరం కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు 28 మంది, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, ఆయా మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు.

అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.