Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పి.ఆర్.ఓ (PRO)ల పాత్ర ఎంతో కీలకమైనది

⏩ఎమ్మెల్యేల ప్రజా సంబంధాల అధికారుల (PRO) అవగాహన వర్క్‌షాప్‌లో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పి.ఆర్.ఓ (PRO)ల పాత్ర ఎంతో కీలకమైనది
Share Short Clip Download PDF

హైదరాబాద్ (రైట్స్ మీడియా): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా పూలే భవన్ వేదికగా శాసనసభ్యుల (MLAs) వద్ద పనిచేసే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ల (PROs) కోసం ఏర్పాటు చేసిన "వన్ డే వర్క్‌షాప్" (ఒక రోజు అవగాహన సదస్సు) లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

ప్రజా ప్రతినిధులకు మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే పి.ఆర్.ఓ (PRO)ల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలోనూ, సమాచార మార్పిడిని వేగవంతం చేయడంలోనూ మెరుగైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు పి.ఆర్.ఓ లు పాల్గొన్నారు.

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..