Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

మున్సిపల్ బాండ్ల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

నిధుల సమీకరణ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు

మున్సిపల్ బాండ్ల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
Share Short Clip Download PDF

నిధుల సమీకరణ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు

జిడబ్ల్యూఎంసీ(రైట్స్ మీడియా ): నగరాభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి మున్సిపల్ బాండ్లు కీలకంగా ఉపయోగపడతాయని వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు పూనమ్ అహ్లువాలియా, సుజాత, వృద్ధిమాన్ పేర్కొన్నారు.

మున్సిపల్ బాండ్ల ప్రక్రియలో భాగంగా క్రెడిట్ రేటింగ్, బ్యాంకులతో సమన్వయం తదితర అంశాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు.

బుధవారం వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వివిధ మున్సిపాలిటీల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మున్సిపల్ బాండ్ల ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ క్యాంపు కార్యాలయం నుంచి కమిషనర్ టి. వెంకన్న పాల్గొని, వరంగల్ నగరంలో మున్సిపల్ బాండ్లకు సంబంధించి చేపడుతున్న చర్యలు, సాధించిన పురోగతిని వివరించారు.

మున్సిపల్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని, తద్వారా నగరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

నగర సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని మున్సిపల్ బాండ్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామని కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపడుతూ, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ బాండ్ల ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ జనార్దన్, అకౌంట్స్ ఆఫీసర్ శివలింగం, అసిస్టెంట్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ప్రతిభ, సీడీఎం ఏ నుండి రవలి, తదితరులు పాల్గొన్నారు.