డోర్నకల్(రైట్స్ మీడియా): మరిపెడ మండలంలోని నీలికుర్తి గ్రామానికి చెందిన రాసాల బిక్షం ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పరామర్శించారు.

ఈ సందర్భంగా బిక్షం గారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.