హనుమకొండ (రైట్స్ మీడియా): వెట్టిచాకిరీపై అవగాహన కల్పించడం, బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343ను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్వేచ్ఛ రథం వాహనాన్ని సోమవారం కలెక్టరెట్ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ప్రచార వాహనం హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ, వెట్టిచాకిరీ, కార్మికుల హక్కులు, దోపిడీకి గురైన సందర్భాల్లో ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న విధానాలపై ప్రజలకు, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికులకు అవగాహన కల్పించునుంది