ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఉర్సుగుట్ట ఆకుతోట కన్వెన్షన్ హలో నిర్వహించిన గురుపూజోత్సవం , జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మెన్ గుండు సుధారాణిలతో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పలువురు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు.
గురుపూజోత్సవంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను అభినందించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..
విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు మరువలేనివని పేర్కొన్నారు. విద్యార్థులకు కేవలం విద్యను అందించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ సేవలను మరింత విస్తృతం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.