పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ–2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా అత్తలూరి సుబ్బారావు (సుబ్బు) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, ఇతర అతిథులు హాజరై నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారుల అభివృద్ధి, సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. నరసరావుపేటలో ఆయిల్,మెడికల్ కల్తీ జరుగుతుందని, అందరూ కాదు, అలాచేసేవారిపై చర్యలు తీసుకుంటే రికమండీషన్స్ చేయవద్దు. అది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిందని సభా ముఖంగా తెలిపారు.
నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
⏩నూతన అధ్యక్షులుగా అత్తలూరి సుబ్బారావు (సుబ్బు) ప్రమాణ స్వీకారం.