సోమవారం నాడు జూరాల ప్రాజెక్టు వద్ద హైటెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా జూరాల డ్యాంపై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో 12 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూరాల వద్ద హైటెన్షన్.. పోలీసుల మోహరింపు
సాగునీటి సమస్యలపై గొంతెత్తుతున్న బీఆర్ఎస్ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందని పార్టీ ఆరోపించింది. జూరాల నుంచి నీళ్లు ఇవ్వడం లేదంటూ ధర్నాకు రైతులు సిద్ధమయ్యారు. దీంతో ప్రాజెక్టుకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.