Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

విద్యార్థులు నైపుణ్యాలు, సమస్యల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

విద్యార్థులు నైపుణ్యాలు, సమస్యల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
Share Short Clip Download PDF

నరసరావుపేట (రైట్స్ మీడియా): నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (NEC)లో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, భవిష్యత్తులో ఎదురయ్యే ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్, అంతర్జాతీయ వీసా నిబంధనల్లో మార్పుల కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగాల స్వరూపం మారుతోందని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా, సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి, సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహం, విద్యా రీయింబర్స్‌మెంట్ సదుపాయాలు, కొత్త ఐటీ కంపెనీలు, పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలోని నాలుగేళ్ల సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ, తోటి విద్యార్థులు, సీనియర్లు, అధ్యాపకులతో కలిసి పనిచేయడం ద్వారా కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకుని, సివిల్స్ సాధించిన ఎం. జైకృష్ణ ప్రయాణం నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాలని సూచించారు.

విద్యార్థులు నైపుణ్యాలు, సమస్యల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సి.హెచ్. అరవింద బాబు, ఐఏఎస్ అధికారి ఎం. జైకృష్ణ, కళాశాల యాజమాన్య ప్రతినిధులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

విద్యార్థులు నైపుణ్యాలు, సమస్యల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు