వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ కు నూతన సీఐ గా జయశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్కడా అక్రమంగా బెల్ట్ షాపులు, గుడుంబా విక్రయాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు, గుడుంబా, నాటుసారా తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా, తయారు చేసినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాం. ఎవరి ఒత్తిడికి తలొగ్గేది లేదు అని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని, తమ పరిధిలో ఎక్కడైనా బెల్ట్ షాపులు, గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.