వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం మధ్యలో నుండి నూతనంగా వేస్తున్న 11 కె.వి. విద్యుత్ లైన్ పనులను నిలిపివేయాలని కోరుతూ గ్రామ వార్డు సభ్యులు వర్ధన్నపేట విద్యుత్ శాఖ ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) తరుణ్ కు వినతి పత్రం అందజేశారు. గత కొద్ది రోజులుగా ఇల్లంద గ్రామంలోని పాల కేంద్రం నుండి గాందీ కాలనీ మీదుగా నూతన 11 కె.వి. లైన్ కోసం విద్యుత్ శాఖ స్తంభాలు వేస్తోంది. ఆ లైన్ ను గ్రామ శివారు నుండి వేయకుండా నేరుగా గ్రామం మధ్యలో, ఇళ్ల మీద నుండి వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామం మధ్యలో నుండి హైటెన్షన్ 11 కె.వి. లైన్ వేస్తే చిన్న పిల్లలు, వృద్ధుల ప్రాణాలకు ముప్పు. ఏదైనా వైర్ తెగి పడితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇప్పటికే ఉన్న లైన్లతోనే భయపడుతున్నాం. మళ్ళీ కొత్త లైన్ కూడా ఇళ్ల మీద నుండే వేస్తే ఎలా?" అని వార్డు సభ్యులు ఏఈకి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లంద గ్రామ వార్డు సభ్యులు బాషబోయిన ప్రవీణ్,చీపురు వెంకటస్వామి, ఎలిశాల రాజేష్,పోశాల సురేష్,మునుకుంట్ల సూరయ్య, మునుకుంట్ల భిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.
ఇల్లంద గ్రామం మధ్యలో నుండి 11 కేవీ లైన్ పనులు ఆపండి
ఏఈకి వార్డు సభ్యుల వినతి