Monday, 28 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
రాష్ట్రాలు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్

⏩అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నాం:ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్
Share Short Clip Download PDF

డోర్నకల్/మరిపెడ(రైట్స్ మీడియా): మరిపెడ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నూతన రేషన్ కార్డులు, స్మార్ట్ కార్డుల పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ చెక్కులు, సంబంధిత పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ప్రభుత్వ విప్