శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సంయమనం పాటించాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి సూచించారు.
జూరాల కెనాల్ ఆయకట్టు పరిధిలోని రైతులు సాగునీటి సమస్యలను ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
జూరాల డ్యాం వద్ద ఎడమ కాలువ ప్రాంతాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించి, క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
రైతులు తమ సమస్యలను శాంతియుతంగా తెలియజేసే సమయంలో సంయమనం పాటించాలని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.