Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

ఉడిపిలో శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసిన ప్రధాని మోదీ

ఉడిపిలో శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసిన ప్రధాని మోదీ
Share Short Clip Download PDF

ఉడిపిలోని శ్రీ పెజావర్ అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం కలిశారు. ఈ స‌మావేశంలో ప‌ద్మ‌విభూష‌ణ్ య‌తిపుల్ చక్రవర్తి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ జన్మ శత జయంతి ఉత్సవాల లోగోను ప్రధాని ఆవిష్కరించారు.

ఉడిపిలోని శ్రీ పెజావర్ అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కలిశారు. ఈ స‌మావేశంలో ప‌ద్మ‌విభూష‌ణ్ య‌తిపుల్ చక్రవర్తి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ జన్మ శత జయంతి ఉత్సవాల లోగోను ప్రధాని ఆవిష్కరించారు.

'X' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ, శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీ జీవితం భక్తి, విద్య, సేవలతో స్ఫూర్తి పొందిందని, ఆయన జీవితం లెక్కలేనంత మందికి ప్రేరణ అని ప్రధానమంత్రి రాశారు.

శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీ జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, కార్యకలాపాలు ఆయన ఆదర్శాలను, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి రాశారు.

ఉడిపిలో శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలిసిన ప్రధాని మోదీ