Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

సాంకేతికతతో నేరాల కట్టడి.. సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్, సేఫ్ స్టే యాప్ ప్రారంభం

సాంకేతికతతో నేరాల కట్టడి.. సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్, సేఫ్ స్టే యాప్ ప్రారంభం
Share Short Clip Download PDF

నేరాల నియంత్రణ, పోలీసుల నిఘాను మరింత పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరిష్ కుమార్ గుప్తా సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్‌తో పాటు సేఫ్ స్టే ఏపీ ప్రారంభించారు.

ఒకే పోర్టల్‌లో డ్రోన్ల పర్యవేక్షణ

సెంట్రలైజ్డ్ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిఘా కోసం వినియోగిస్తున్న డ్రోన్ల సమాచారాన్ని ఒకే చోటు నుంచి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

పోలీసులు ప్రత్యక్షంగా చేరుకోలేని ప్రాంతాలకు సైతం డ్రోన్లు సులభంగా చేరుకుని నిఘా నిర్వహించగలవని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. డ్రోన్ మానిటరింగ్ వ్యవస్థను జిల్లా ఎస్పీ కార్యాలయంతో పాటు డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు వెల్లడించారు.

ఈ పోర్టల్ ద్వారా ఒకేసారి 2,000 డ్రోన్లను పర్యవేక్షించే సామర్థ్యం ఉంటుందని తెలిపారు. నేరాల నియంత్రణ, నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో డ్రోన్ టెక్నాలజీ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.