Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఆరేపల్లిలో ఘనంగా శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ.

ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించిన ఎమ్మెల్యే KR నాగరాజు.

ఆరేపల్లిలో ఘనంగా శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ.
Share Short Clip Download PDF

గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ డివిజన్ ఆరేపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

శివాజీ జీవితం, ఆయన చేసిన ధర్మపరమైన పోరాటాలు, ప్రజల స్వేచ్ఛ కోసం సాగించిన యుద్ధాలు స్ఫూర్తిదాయకం అన్నారు.ధర్మం, న్యాయం, స్వాభిమానంతో పాలన చేసిన శివాజీ జీవితాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సేవా సమితి కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సిందె రవీందర్, అరె సంక్షేమ సంఘం అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ, మాజీ కార్పొరేటర్ శోభారాణి అనిల్, మాజీ pacs చైర్మెన్ బుద్దే పెద్దన్న, ఉద్యమ కారుల సంఘం అధ్యక్షులు సోమిడి అంజన్ రావు, వరంగల్ జిల్లా అరె సంఘం అధ్యక్షులు నర్సింగ రావు, రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు చందర్ రావు, మాజీ పిఎస్ సిఎస్ చైర్మన్ బుద్దే శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ బిక్షపతి, సీనియర్ నాయకులు మనోహర్, బిజిలి సంపత్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఆరేపల్లిలో ఘనంగా శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ.