కాకతీయ విశ్వవిద్యాలయం లోని ప్రభుత్వ పాలన మరియు మానవ వనరుల విభాగంలో విభాగం అధిపతి ప్రొఫెసర్ పెదమళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విభాగం విద్యార్థులు మరియు పరిశోదక విద్యార్థులు అధ్యాపకులు మానవీయ శాస్త్ర భవనం ఆవరణలో పెద్ద ఎత్తున ముక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా విభాగం అధిపతి ప్రొఫెసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం 2019 నుంచి విభాగం ఆవరణలో విద్యార్థుల తో స్కాలర్ల తో అధ్యాపకుల తో మొక్కలు నాటించటమే కాకుండా వాటిని పరిక్షించటంలో కీలక పాత్ర వహించటం జరుగుతుందని, అదేవిధంగా 2019 నుండి ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటండి సెల్ఫీ దిగండి సంతకం చేయించుకోండి అనే నినాదంతో డిపార్ట్మెంట్ ఆవరణలో అనేక మొక్కలు నాటించడం జరిగిందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విభాగం అధ్యాపకులు డా. ఆకుతోట శ్రీనివాసులు, డా. చీకటి శ్రీను, డా. బుర్రి ఉమాశంకర్, నాగేశ్వర్రావు, దామెర దేవదాసు, మాదారపు సురేష్, నక్క చేరాలు పరిశోధక విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.