హైదరాబాద్ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, దాని ప్రాముఖ్యతను ప్రజలకు ముఖ్యంగా యువతకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఆడప రాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు వర్ధన్నపేట తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆడప రాజు మాట్లాడుతూ
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందింది.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా అధికారికంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్ణయం తీసుకుని అన్ని మండలాలు, గ్రామాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో జెండా ఆవిష్కరణలు, సభలు, అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించి,యువతకు నిజమైన చరిత్ర తెలియజేయాలి" అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.