Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

స్వయం సహాయక బృందాల సభ్యులు అన్ని రంగాలలో ముందుండాలి: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్

మహిళా సంఘాలు, ఆర్థిక పురోగతికి ప్రత్యామ్నాయ నూతన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేక చర్యలు : జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్.

స్వయం సహాయక బృందాల సభ్యులు అన్ని రంగాలలో ముందుండాలి: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్
Share Short Clip Download PDF

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల సభ్యులు, రైతులు ఉద్యానవన సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, ఉద్యానవన శాఖ, బ్యాంకింగ్ సెక్టార్లతో కలిసి మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలు అవగాహన కార్యక్రమాలపై నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రతి గ్రామంలోనూ రైతులు, మహిళా సంఘాలకు ఆయిల్ పామ్ సాగుపై సమగ్ర అవగాహన కల్పించాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, స్థిరమైన రాబడినిచ్చే ఆయిల్ పామ్ లాభదాయకమైన పంటగా మారనుందని తెలిపారు.  సాంప్రదాయ పంటల స్థానంలో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, కూరగాయలు, పండ్లు, పువ్వుల, ముల్బరీ (పట్టుసాగు) వంటి హార్టికల్చర్ పంటల వైపు మళ్లడం ద్వారా రైతులకు, మహిళలకు అధిక ఆదాయం లభిస్తుందన్నారు.
మహిళా సంఘాల సభ్యులు అదనపు ఆదాయం కోసం పుట్టగొడుగుల (Mushroom) పెంపకం, తేనెటీగల పెంపకం వంటి ఆధునిక వ్యాపార/ఉపాధి అవకాశాలను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రాచుర్యంలోకి తెచ్చి, గ్రామీణాభివృద్ధికి బాటలు వేయాలని,
స్వయం సహాయక సంఘాల సభ్యులు వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు వాణిజ్య పంటల వైపు అడుగులు వేయాలి
మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు,
జిల్లాలోని స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు వాణిజ్య కార్యకలాపాలు, పారిశ్రామిక కార్యకలాపాలు మరియు వాణిజ్య పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
PD-DRDA, GM-DIC, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, LDM, NABARD అధికారులు హాజరై మహిళా సంఘాల సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
మహిళలు ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపు, రుణాల వినియోగం, చిన్న వ్యాపారాల నిర్వహణలో మంచి అనుభవాన్ని సాధించారని తెలిపారు. ఇకపై సంప్రదాయ చిన్న వ్యాపారాలకు పరిమితం కాకుండా వాణిజ్య కార్యకలాపాలు, సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సేవా రంగం వంటి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.

మహిళా సంఘాలు సమూహంగా ముందుకు వచ్చి ఆహార ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మిల్లింగ్, పశుపోషణ, పాల ఉత్పత్తులు, హస్తకళలు, వస్త్ర తయారీ, ఇతర సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు వివరించారు. ఇందుకు ప్రభుత్వం, బ్యాంకులు, NABARD మరియు సంబంధిత శాఖల ద్వారా అందుబాటులో ఉన్న రుణాలు, సబ్సిడీలు, శిక్షణ మరియు ఇతర ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, హాస్పటల్ సెక్టార్లో ఉపాధి అవకాశాలు, నూతనంగా మార్కెట్లో వచ్చే కొత్త వ్యాపారాలు చేయాలని సూచించారు.

అలాగే రైతులు సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు మరియు ఇతర అధిక విలువ కలిగిన పంటల సాగుపై దృష్టి పెట్టాలని తెలిపారు. మార్కెట్ అవసరాలను ముందుగానే తెలుసుకుని పంటల ఎంపిక, ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్‌ను సమన్వయంతో చేపట్టడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు.

GM-DIC ఆధ్వర్యంలో పారిశ్రామిక యూనిట్ల స్థాపనకు సంబంధించిన ప్రాజెక్టు తయారీ, రుణ సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు అవసరమైన మార్గదర్శకత్వంపై అవగాహన కల్పించారు. LDM మరియు NABARD అధికారులు బ్యాంకు రుణాలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆర్థిక నిర్వహణ మరియు సంఘాల ద్వారా చేపట్టగల కార్యకలాపాలపై వివరించారు. ఉద్యానవన శాఖ అధికారులు వాణిజ్య మరియు ఉద్యాన పంటల సాగు, సాంకేతికత, మార్కెటింగ్ అవకాశాలపై సూచనలు అందించారు.

మహిళలు “పొదుపు నుంచి పెట్టుబడి వైపు, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వైపు” ముందుకు సాగుతూ కుటుంబ ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని అధికారులు పిలుపునిచ్చారు.

మార్కెట్లో డిమాండ్ ఉన్న నూతన వ్యాపారాలు నడుస్తున్న వ్యాపారాల గురించి వచ్చిన మహిళా సంఘాల సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియపరచి తగు సూచనలు సలహాలు జారీ చేశారు,

మష్రూమ్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సహకారం అందించాలని దంతాలపల్లి మహిళా సంఘాల సభ్యులు కోరగా అందుకు తీసుకోవలసిన చర్యల గురించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు,

ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఉద్యాన వన శాఖ అధికారి . జి.మరియన్నా, లీడ్ బ్యాంకు మేనేజర్ యాదగిరి, నాబార్డ్ జీఎం, డిపిఎం శ్రీకాంత్, మహిళా సంఘాల ప్రతినిధులు స్వరూప, సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

స్వయం సహాయక బృందాల సభ్యులు అన్ని రంగాలలో ముందుండాలి: జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్