పాలకుర్తి, అక్టోబర్ 8(రైట్స్ మీడియా): పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైనిక సూపర్ మార్ట్ ను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సైనిక సూపర్ మార్ట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.