Saturday, 19 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రయాణికుల ఇబ్బందులు తొలగించండి: ఆర్టీసీ డీఎం కు జనసేన వినతి

ప్రయాణికుల ఇబ్బందులు తొలగించండి: ఆర్టీసీ డీఎం కు జనసేన వినతి
Share Short Clip Download PDF

నర్సంపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నియోజకవర్గ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు.

అనంతరం శివకోటి యాదవ్ మాట్లాడుతూ..

నర్సంపేట డిపో నుండి నిజామాబాద్ కు వెళ్లే 15 నుండి 17 బస్సు సర్వీసులతో పాటు శ్రీశైలం, భద్రాచలం, ఆదిలాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను తగ్గించారని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శివకోటి యాదవ్ పేర్కొన్నారు. అలాగే పదవీ విరమణలు, బదిలీలతో డిపోలో సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు.
ఈ విషయంపై డిపో మేనేజర్ సరస్వతిని కలిసి వివరణ కోరగా, కొన్ని మార్గాల్లో బస్సులను తగ్గించడం వాస్తవమేనని, అయితే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నర్సంపేట నుండి వరంగల్ మీదుగా ప్రత్యామ్నాయ సర్వీసులను పెంచామని, త్వరలోనే సిబ్బంది కొరతను కూడా అధిగమిస్తామని ఆమె తెలిపినట్లు శివకోటి యాదవ్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన డిపో మేనేజర్ ను కోరారు.

ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఎలబోయిన డేవిడ్, రోడ్డ శ్రీకాంత్, టేకుల రవి, బోడ వీరన్న తదితరులు పాల్గొన్నారు.