హసన్‌పర్తి మండలం హెచ్ఎం తండా గ్రామంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి గురువారం తండా ప్రజలు ఘనంగా పాలాభిషేకం చేశారు. గతంలో గుట్టల్లో, అడవుల్లో ఉండే తండాలకు ఏ గుర్తింపు లేకుండే. అలాంటి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి, "మా తండాలో మా పాలన" అనే మహోన్నత నినాదాన్ని నిజం చేసిన మహానేత కేసీఆర్ అని గ్రామస్తులు కొనియాడారు.
హసన్‌పర్తి హెచ్ఎం తండాలో కేసీఆర్ చిత్రపటానికి తండా ప్రజల పాలాభిషేకం
తండాలకు గుర్తింపు ఇచ్చిన దేవుడు కేసీఆర్
తండాను గ్రామ పంచాయతీగా చేయడమే కాకుండా, గ్రామంలో సిసి రోడ్లు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీరు, నూతన గ్రామ పంచాయతీ భవనం, పాఠశాల భవనం, వైద్య సౌకర్యం, ఇంటింటికి సిసి రోడ్లు వంటి అభివృద్ధి పనులు చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. అంతేకాకుండా ఎస్టీ రిజర్వేషన్లు పెంచి, విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో హసన్ పర్తి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బండి రజనీ కుమార్ మల్లారెడ్డి, పల్లె PACS సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, ములకలపల్లి జయశంకర్, మాజీ వైస్ ఎంపీపీ బండ రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మొగిలి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాజీ రాజు నాయక్, ధర్మా, క్రాంతి, అభిలాష్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు. అనంతరం తండా ప్రజలంతా కలిసి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.