విశ్వవిద్యాలయ కళాశాల యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల లోగోను వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏడాది పొడవునా నిర్వహించనున్న వివిధ అకాడమిక్, పరిపాలనా, సాంస్కృతిక, విద్యా కార్యక్రమాల్లో ఈ లోగో ప్రతిబింబిస్తుందని ఆమె తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ సంవత్సరంలో కళాశాల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ఆనందంగా ఉందని, కళాశాలకు విశిష్టమైన పూర్వ విద్యార్థుల (Alumni) సమూహం ఉందని పేర్కొన్నారు.
లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి, ఆచార్య బి. సురేష్ లాల్, డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆచార్య వై. వెంకయ్య, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.