మహబూబాబాద్, నవంబర్ 03( రైట్స్ మీడియా): ఎల్ నినో వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన మరియు మామిడిలో మేలైన యాజమాన్య పద్దతులు, సస్యరక్షణ పై జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహబూబాబాద్ పట్టణ శివారులోని ఏటిగడ్డ తండ రైతు వేదిక నందు ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు అవగాహన పరిచారు.
ఈ సందర్బంగా మామిడి చెట్టు బెరడులో ఉన్న తేనె మంచు పురుగులను నివారించడానికి ఎసిఫేట్ @ 1.5 గ్రా./లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ @ 0.3 మి.లీ./లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలని పక్షి కన్ను తెగులు గమనిస్తే, కార్బెండజిమ్ మందును 1 గ్రా./లీ. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని అన్నారు.
పొటాషియం నైట్రేట్ (13-0-45) @ 10 గ్రా./లీ. లేదా మోనో పొటాషియం ఫాస్ఫేట్ (00-52-34) @ 10 గ్రా./లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలని, పూత వచ్చే వరకు మామిడి తోటకు నీరు పెట్టడం ఆపివేయాలని అన్నారు. బోర్లు, బావుల క్రింద కూరగాయలు, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, పసుపు,మల్బరీ, మునగ, పండ్లు, పూలు సాగు చేస్తూ మన జిల్లా రైతులు ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం పొందుతున్నారన్నారు.