తొర్రూరు(రైట్స్ మీడియా): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియకు ఈ నెల 6వ తేదీ చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రులందరూ సకాలంలో తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు.
తొర్రూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న నమోదు ప్రక్రియను పరిశీలించి, ఓటరు నమోదుకు వస్తున్న పట్టభద్రులకు అందిస్తున్న సేవలు, నమోదు వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు.