దళిత సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు అరూరి సాంబయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని, స్పీకర్ చైర్‌ను అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని అవమానమని మండిపడ్డారు.
దళిత వర్గానికి చెందిన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. తాతా మధు వ్యాఖ్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం కాంగ్రెస్ నాయకులు సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎమ్మెల్సీ తాతా మధుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ తాతా మధును వెంటనే భర్తరఫ్ చేయాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మేర సంఘం చైర్మన్ వెంకటరాజం,ఎనుమాముల మార్కెట్ చైర్మన్ పులి ప్రియాంక అనిల్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ ,లీగల్ సెల్ చైర్మన్ తోట రాజ్ కుమార్,మైనారిటీ సెల్ చైర్మన్ అజిజ్ ఉల్లా బేగ్,INTUC కూర వెంకట్,మీడియా సెల్ ఇంచార్జ్ మార్క విజయ్,మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు,పోతుల శ్రీమన్నారాయణ,జక్కుల రవీందర్,మామిండ్ల రాజు,బోడ దిన్న,నసీం జహాన్,నాయకులు అంబేద్కర్ రాజు,అంకుస్,కార్తీక్ ,సమత,రహీమున్నీసా మరియు డివిజన్ అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు.