కాకతీయ విశ్వవిద్యాలయ నూతన అభివృద్ధి అధికారిగా జంతుశాస్త్ర విభాగ ఆచార్యులు, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య వై. వెంకయ్య నియమితులయ్యారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఆచార్య వై. వెంకయ్య వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా స్వీకరించారు. ఆయన ప్రస్తుత అభివృద్ధి అధికారి ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆచార్య వై. వెంకయ్య గతంలో జంతుశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళికల సంఘ అధ్యక్షులుగా, హాస్టల్ డైరెక్టర్‌గా, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా తదితర కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆచార్య వై. వెంకయ్యను విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
కాకతీయ విశ్వావిద్యాలయ నూతన అభివృద్ధి అధికారిగా ఆచార్య వై. వెంకయ్య