Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి

హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య.

ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి
Share Short Clip Download PDF

ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్స్ కు మానవీయ కోణంలో సేవలు అందించాలని హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ నిఖిల్ , జిల్లా మేనేజర్ శ్రీ విక్రమ్, మున్సిపల్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి రోహిణి హాస్పిటల్, ఏకశిలా హాస్పిటల్ లను సంయుక్తంగా DMHO తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సేవలందిస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ల వివరాలు , అందిస్తున్న సేవలకు తీసుకునే ఫీజుల వివరాలతో కూడిన ధరల పట్టిక, మరియు వివిధ ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన అనుమతులు వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ , సీఎంఆర్ఎఫ్, మరియు ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.
వివిధ పథకాలలో పొందుపరిచిన నియమాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలని వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని సూచించారు . డిఎంహెచ్ఓ కార్యాలయానికి సమర్పించవలసిన వివిధ రిపోర్టులను సకాలంలో అందజేయాలన్నారు.
అక్కడ అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫీజుల పట్టిక వచ్చిన వారికి కనిపించే విధంగా తగినంత సైజులో ప్రముఖంగా ప్రదర్శించకపోవడం , గుర్తించిన ఇతర లోపాలకు సంబంధించి రెండు ఆసుపత్రులకు కూడా నోటీసులు జారీ చేస్తామని డాక్టర్ అప్పయ్య తెలియజేశారు .

ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ..

క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం కన్సల్టేషన్ ఫీజులు, వైద్య సేవలకు ఎంత తీసుకోవాలి అనే ధరల పట్టికను,సేవలు అందిస్తున్న డాక్టర్స్ వివరాలను పేషెంట్లు వారి సహాయకులు క్లినిక్లు లేదా ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు పరిశీలించాలన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి