Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు అప్రజాస్వామికం

వర్ధన్నపేట బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఆడప రాజు.

బీజేపీ నేతల ముందస్తు అరెస్టు అప్రజాస్వామికం
Share Short Clip Download PDF

• ఫీజు రీయింబర్స్‌మెంట్ పై చలో అసెంబ్లీ నేపథ్యంలో వర్ధన్నపేటలో అరెస్టులు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని బీజేపీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొంటారనే అనుమానంతో వర్ధన్నపేట మండల బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడాన్ని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి.

సోమవారం ఉదయం నుండి వర్ధన్నపేట మండలంలోని పలువురు బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు వారి ఇళ్ల వద్దనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఆడప రాజు మాట్లాడుతూ ..

విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ప్రశాంతంగా నిరసన తెలిపేందుకు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం దారుణం. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని చూస్తోంది. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని మండిపడ్డారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేటి సత్యం, కుమారస్వామి, మల్లెపాక అనిల్, గిరి, తేజనాయక్,దేవేందర్, సుంకరి బాబు, ఎల్ల స్వామి, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.