టిఎన్జీఓస్ కాలనీ ఫేస్పో 2 లో పోషమ్మ తల్లి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు . ఈ ఉత్సవాలకు పోచమ్మ తల్లి ఆలయ కమిటీ అధ్యక్షులు దొనకొండ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 400 కుటుంబాలకు సంబంధించినటువంటి భక్తులు ఈ యొక్క బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై కాలనీ వాసులతో పోషమ్మ తల్లి బోనాల ఉత్సవాళ్లలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కాలనీ ప్రజల మీద అమ్మ వారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. పోషమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని అన్నారు. కాలనీ అభివృద్ధికి నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. అందరి యొక్క భాగోగుల్లో నేను ఉంటానని మీకు మీ యొక్క కుటుంబ సభ్యుడిగా ఎల్లవేళలా నా వంతు సహకారం మీకు ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కలకొండ లక్ష్మణ్ రెడ్డి, సెక్రటరీ కిరణ్ కుమార్, డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు ఫోర్ రెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యదర్శి గోశాల రమేష్ బాబు, ఆలయ కమిటీ సలహాదారులు రామ్ రెడ్డి సతీష్ రెడ్డి, మల్లారెడ్డి, సభ్యులు కిషన్ రెడ్డి, నారాయణ, రాజా రమేష్ శ్రీధర్ రెడ్డి, రాజు కేశవరావు, శ్రీధర్ ఆచారి, రవీందర్ రెడ్డి, మంజుల తదితర భక్తులు పాల్గొన్నారు.
టిఎన్జీఓస్ కాలనీ ఫేస్ 2లో ఘనంగా పోషమ్మ తల్లి బోనాల ఉత్సవాలు